RR vs MI: గుజరాత్ ధాటికి కుదేలైన ముంబై.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన హార్దిక్ సేన

RR vs MI: గుజరాత్ ధాటికి కుదేలైన ముంబై.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన హార్దిక్ సేన

వాంఖడే వేదికగా మంగళవారం (మే 6) గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ లో నిరాశపరించింది. గుజరాత్ బౌలర్ల ధాటికి తలవంచుతూ ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. సూర్య కుమార్ యాదవ్(35), విల్ జాక్స్ (53) ఉన్నంతవరకు భారీ స్కోర్ చేసేలా కనిపించినా వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో ముంబై కుప్పకూలింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. జాక్స్ (53) టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కొయెట్జీ, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ముంబైకి తొలి ఓవర్లోనే సిరాజ్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ రికెల్ టన్ (2) రెండో బంతికే ఔటయ్యాడు. కాసేపటికే రోహిత్ శర్మ భారీ షాట్ కు ప్రయత్నించి అర్షద్ ఖాన్ చేతికి చిక్కాడు. ఈ దశలో విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. పవర్ ప్లే లో భారీ షాట్లతో చెలరేగుతూ గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. వీరి ధాటికి ముంబై పవర్ ప్లే లో 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు రాబట్టింది. 

పవర్ ప్లే తర్వాత కూడా జాక్స్, సూర్య నిలకడగా ఆడారు. జాగ్రత్తగానే ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో జాక్స్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్ కు 71 పరుగులు జోడించిన తర్వాత సాయి కిషోర్ బౌలింగ్ లో సూర్య ఔటయ్యాడు. దీంతో ముంబై ఒక్కసారిగా కుప్పకూలింది. హాఫ్ సెంచరీ చేసిన జాక్స్ (53) ను రషీద్ ఖాన్ ఔట్ చేయగా.. హార్దిక్ పాండ్య (1), తిలక్ వర్మ (7), నమన్ ధీర్ (7) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివర్లో కార్బిన్ బాష్ 22 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టు స్కోర్ ను 150 పరుగుల మార్క్ కు చేర్చాడు.