హైదరాబాద్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై

హైదరాబాద్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై

షార్జా: సండే ఫైట్ కు సన్ రైజర్స్ రెడీ అయ్యింది. హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసిన హైదరాబాద్.. ముంబై ఇండియన్స్ తో ఫైట్ కు సిద్దమైంది. ఆదివారం షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ తీసుకుంది. రెండు జట్లలో విధ్వంసకర బ్యాట్స్ మెన్ ఉండడంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనాలు ఉన్నాయి. చెన్నైపై గెలిచిన జోష్ లో ఉన్న సన్ రైజర్స్ అదే ఊపును… ఇవాళ్టి మ్యాచ్ లోనూ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయింది.

అయితే మొన్నటి మ్యాచ్ లో గాయపడ్డ పేసర్ భువనేశ్వర్ ఆడతాడా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే బాగా ఆడితే హైదరాబాద్ కు తిరుగుండదు. అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్ చెన్నైపై ఆడిన ఇన్నింగ్స్ తో జట్టులో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఒకవేళ ఈ మ్యాచ్ కు భువీ దూరమైతే థంపి , సిద్ధార్ద్ కౌల్, సందీప్ శర్మలో ఒకరు ఫైనల్ జట్టులోకి రావొచ్చు. ఇక ముంబై కూడా పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ సాధించి.. కాన్ఫిడెన్స్ తో కనిపిస్తోంది. లాస్ట్ మ్యాచ్ లో  కెప్టెన్ రోహిత్  శర్మతో పాటు హార్దిక్  పాండ్యా  ఫామ్ లోకి రావడంతో జట్టు జోష్ లో ఉంది. పొలార్డ్, ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించారు. అయితే డి కాక్ వరుసగా ఫెయిలవుతుండడం ముంబైని ఇబ్బంది పెడుతోంది.

టీమ్స్ వివరాలు: