IPL 2023 : వాంఖడే వార్ వన్ సైడ్...6 వికెట్ల తేడాతో ముంబై కిర్రాక్ విక్టరీ

IPL 2023 : వాంఖడే వార్ వన్ సైడ్...6 వికెట్ల తేడాతో ముంబై కిర్రాక్ విక్టరీ

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అయిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు టాప్ గేర్ లోకి వచ్చింది. భారీ టార్గెట్ ఛేజింగ్లో సూర్యకుమార్ యాదవ్ (35 బాల్స్లో 7 ఫోర్లు, 6 సిక్సులు 83), సెహాల్ వదేరా (134 బాల్స్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 52 నాటౌట్), ఇషాన్ కిషన్ (21  బాల్స్ 4 ఫోర్లు, 4 సిక్స్ లతో 42) దంచికొట్టడంతో మే 9వ తేదీ మంగళవారం జరిగిన  మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై నెగ్గింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిది నుంచి మూడో ప్లేస్కు దూసుకొచ్చింది.

200 పరుగుల టార్గెట్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్  ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది..
ఛేజింగ్లో ఇషాన్ ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేశాడు. సెకండ్ ఓవర్లో మూడు ఫోర్లు, తర్వాతి ఓవర్లలో నాలుగు సిక్స్లు, ఓ ఫోర్ కొట్టడంతో 51/0కి చేరింది, కానీ ఐదో ఓవర్లో హనరంగ (2/53) డబుల్ ఝలక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాతో ఈ ఇద్దర్ని ఔట్ చేయడంతో స్కోరు బోర్డు 52/2గా మారింది. ఈ దశలో సూర్య, నెహాల్ వదేరా ఆర్ సీబీ బౌలర్లను ఉతికి ఆరేశారు. సిక్స్ తో వదేరా, ఫోర్తో సూర్యకుమార్ క్రమంగా బ్యాట్లకు పని చెప్పారు. ఓవర్కు ఓ ఫోర్ ఉండేలా బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లే లో 62/2 ఉన్న స్కోరు సగం ఓవర్లు ముగిసేసరికి 99/2తో గాడిలో పడింది. 11వ ఓవర్లో చెరో  రెండు ఫోర్లు..తర్వాతి ఓవర్లో తర్వాతి ఓవర్లో చెరో ఫోర్ బాదారు. 14వ ఓవర్లో సూర్య వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి 26 బాల్స్ లో ఫిఫ్టీ అందుకున్నారు. ఆ వెంటనే 15వ ఓవర్లో 6, 6, 4తో 20 రన్స్ దంచడంతో స్కోరు 174/2కు పెరిగింది. 16 వ ఓవర్లో  సూర్య కుమార్, టీమ్ డేవిడ్ ఔటైనా..వదేరా గ్రీన్ తో కలిసి ముంబై ని విజయ తీరాలకు చేర్చారు.  ఆర్సీబీ బౌలర్లలో హాసరంగా, విజయ్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు..

అంతకు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన  బెంగుళూరు  20 ఓవర్లలో 6 వికెట్లకు 199  పరుగులు చేసింది. కెప్టెన్ డూప్లెసిస్, మాక్స్ వెల్ సూపర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 
 ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఒకే పరుగు చేసిన కోహ్లీ జాసన్ బెహ్రెండోర్ఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే జాసన్ బెహ్రెండోర్ఫ్  మరో వికెట్ తీసుకున్నాడు. అనూజ్ రావత్  క్యాచ్ ఔట్ చేశాడు. దీంతో బెంగుళూరు 16 ఓవర్లకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

డు ప్లెసిస్..మాక్స్ వెల్.. విధ్వంసం
ఈ సమయంలో కెప్టెన్ డు ప్లెసిస్ కు మాక్స్ వెల్ జతకలిశాడు. వీరద్దరు ముంబై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇదే క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. మూడో వికెట్ కు 120 పరుగులు జోడించారు. అయితే 33 బంతుల్లో 4 సిక్సులు, 8 ఫోర్లతో 68 పరుగులు చేసిన మాక్స్ వెల్  జాసన్ బెహ్రెండోర్ఫ్ బౌలింగ్ లోనే పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే మహిపాల్ లామ్రార్(1), కెప్టెన్ డు ప్లెసిస్ (65) వెంట వెంటనే ఔటయ్యారు. 

దినేష్ కార్తీక్ దుమారం...
చివర్లో దినేష్ కార్తీక్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. కేవలం 18 బంతుల్లో సిక్స్, 4 ఫోర్లతో 30 పరుగులు సాధించాడు. ఇతనికి కేదార్ జాదవ్ (12), హసరంగా (12) పరుగులు చేయడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు సాధించింది. ముంబై బౌలర్లలో బెహ్రెండోర్ఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. కామెరూన్ గ్రీన్, జోర్దాన్, కుమార్ కార్తీకేయా తలో వికెట్ దక్కించుకున్నారు.