V6 News

పోలీస్‌ను 100 అడుగులు ఈడ్చుకెళ్లి.. ముంబై వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తు కోర్టు తీర్పు..

పోలీస్‌ను 100 అడుగులు ఈడ్చుకెళ్లి.. ముంబై వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తు  కోర్టు తీర్పు..

ఎనిమిది ఏళ్ల  క్రితం (2015లో) ఓ పోలీసు కానిస్టేబుల్‌ను బైక్ తో దాదాపు 100 అడుగుల దూరం ఈడ్చుకుంటూ వెళ్లిన కేసులో ముంబైకి చెందిన ఓ వ్యక్తికి  కోర్టు రెండేళ్ల  జైలు శిక్ష విధించింది. బోరివలి నివాసి అయిన సాగర్ పరేష్ గోసాలియా ఈ నేరానికి పాల్పడ్డాడు.  

ఎం జరిగిందంటే : ఈ ఘటన 2015 ఏప్రిల్ 21న మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో సుధీర్ ఫడ్కే  కానిస్టేబుల్ డ్యూటీ చేస్తుండగా, గోసాలియా తన బైక్‌తో అనుమానాస్పదంగా కనిపించాడు.

దింతో కానిస్టేబుల్ బైక్‌ ఆపి పేపర్స్  అడగగా, అవి ఇంట్లో ఉన్నాయని గోసాలియా చెప్పాడు. పేపర్స్  తెచ్చుకోవడానికి కానిస్టేబుల్ ఆటో  చార్జీలు ఇచ్చి పంపించాడు. అయితే, గోసాలియా ఆటోలో వెళ్లకుండా, తన బైక్ పై వేగంగా పారిపోవడానికి ప్రయత్నించాడు.

దీంతో కానిస్టేబుల్ జెండే అతని చేయి పట్టుకుని ఆపడానికి ప్రయత్నించగా, గోసాలియా బైక్‌ను ఆపకుండా వేగంగా పోనిచ్చాడు. దింతో  కానిస్టేబుల్ దాదాపు 100 అడుగుల దూరం రోడ్డు వెంట ఈడ్చుకెళ్లాడు. అక్కడున్న ప్రజలు బైక్‌ను అడ్డుకుని కానిస్టేబుల్‌ను రక్షించారు. ఈ సంఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.