ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఓ మహిళా వ్యాపారవేత్తతో ఓ ప్రైవేటు కంపెనీ ఎండీ అతి దారుణంగా వ్యవహరించాడు. తుపాకీతో బెదిరించి ఆమెను వివస్త్రను చేసి వేధింపులకు పాల్పడ్డాడు. ఫ్రాంకో ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఎండీ జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ (51) ఈ దారుణానికి పాల్పడ్డాడు. మీటింగ్ ఉందంటూ బాధితురాలిని తన ఆఫీసుకు పిలిచిన జాయ్.. ఆమెను తుపాకీతో బెదిరించి దుస్తులు తీయాలని ఒత్తిడి చేశాడు.
అనంతరం బాధితురాలిని దుర్భాషలాడాడు. ఆమె నగ్నంగా ఉండగా ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వాటిని బయటపెడతానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు జాన్, మరో ఐదుగురిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.
