
ముంబై: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. చాన్నాళ్లుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. మహమ్మారి విజృంభణ ఎక్కువవుతుండటంతో మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో లాక్‌డౌన్ విధించారు. కరోనా విషయంలో సీరియస్‌గా ఉన్న మహా సర్కార్ మాస్కులు కట్టుకోకపోతే ఫైన్లు వేయాలని పోలీసులకు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో గత 13 రోజుల వ్యవధిలో మాస్కులు కట్టుకోలేదని 58 వేల మందికి ముంబై పోలీసులు జరిమానా వేశారు. ఈ ఫైన్ల ద్వారా రూ.1.16 కోట్లను పోలీసులు వసూలు చేయడం గమనార్హం.