సుశాంత్ సింగ్ కేసు : పోలీసులు స‌హ‌క‌రించ‌డం లేదని అలిగిన సీఎం

సుశాంత్ సింగ్ కేసు : పోలీసులు స‌హ‌క‌రించ‌డం లేదని అలిగిన సీఎం

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్ట‌రీ లో బీహార్ పోలీసుల‌కు ముంబై పోలీసుల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
కేసు విచార‌ణ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌..సుశాంత్ కేసులో ముంబై పోలీసులు స‌హ‌క‌రించ‌డం లేద‌న్నారు. కేసు ద‌ర్యాప్తులో బీహార్ పోలీసుల ప్ర‌మేయం చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, ఇందులో ఎలాంటి రాజ‌కీయం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ముంబైలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న సుశాంత్ సింగ్ కేసును బీహార్ పోలీసులు సొంతంగా ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు నితీష్ కుమార్ చెప్పారు.అందుకే ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని బీహార్ పోలీసులు చెప్పార‌ని, కేసును పూర్తి స్థాయిలో జ‌రిపేలా సీబీఐకు సిఫారసు చేసిన‌ట్లు తెలిపారు.

సుశాంత్ కేసు కేసు దర్యాప్తు కోసం బీహార్ పోలీసులు ముంబైకి రావ‌డంపై మ‌హ‌రాష్ట్ర అధికార పార్టీకి, పోలీసుల్ని క‌ల‌వ‌ర‌పెట్టింద‌నే చెప్పుకోవాలి. ఈ కేసును సీబీఐకి ఇవ్వ‌కుండా ముంబై పోలీసుల ద్వారా విచార‌ణ చేప‌ట్టే విష‌యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ మొండిగా వ్య‌వ‌హరిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకొని వెళుతోంది

సుశాంత్ సింగ్ కేసు ద‌ర్యాప్తు కోసం బీహార్ పోలీసులు మ‌హ‌రాష్ట్ర వెళ్లి అక్క‌డ విచార‌ణ చేపట్టారు. ఆ విష‌యం ముందుగా మ‌హ‌రాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో సంప్ర‌దించి ఉంటే బాగుండేద‌ని, అలా సంప్ర‌దించ‌క‌పోవ‌డం వ‌ల్లే పోలీసులు స‌హ‌క‌రించ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. ఆ ఆరోప‌ణ‌ల‌పై బీహార్ సీఎం నితీస్ కుమార్ స్పందించారు. సుశాంత్ కేసులో ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించడం పోలీసుల క‌ర్త‌వ్యం. ఇది రాజకీయ సమస్య కాదు, మహారాష్ట్ర సీఎంతో చర్చించాల్సిన అవసరం నాకు లేదు. బీహార్ పోలీసులు సొంతంగా విచార‌ణ చేప‌డుతున్నారు. పోలీసుల విచార‌ణ‌లో బీహార్ ప్ర‌భుత్వం జోక్యం చేసుకోద‌ని బీహార్ సీఎం నితీష్ కుమార్ స్ప‌ష్టం చేశారు.