ఫేక్ రెమ్ డెసివిర్.. రూ.18 వేలు కట్టి మోసపోయిన మహిళ

ఫేక్ రెమ్ డెసివిర్.. రూ.18 వేలు కట్టి మోసపోయిన మహిళ

కరోనా విజృంభిస్తున్న వేళ మార్కెట్లో నకిలీ మందుల అమ్ముతున్నారు కొందరు కేటాగాళ్లు. కరోనాకు యాంటి వైరల్ డ్రగ్ అయిన రెమ్ డెసివిర్ కు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇదే చాన్స్ గా తీసుకున్న కేటుగాళ్లు కల్తీ మందులను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ముంబైలోని తిలక్ నగర్ లో ఉండే ఓ మహిళకు ఎదురైంది. అసలేం జరిగిందంటే.. ఆన్ లైన్ లో ఓ నంబర్ కు మెస్సేజ్ చేసి రెమ్ డెసివిర్ ను ఆర్డర్ ఇచ్చింది. మరుసటి రోజు రెమ్ డెసివిర్ ఆమె ఇంటికి వచ్చింది. తీరా చూస్తే మెడిసిన్ కు బదులుగా ఒక పౌడర్ వచ్చింది. అది ఫేక్ అని ఆమె గుర్తించి వెంటనే బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో తెలిసింది ఏంటంటే ఆ మహిళ వాట్సప్ లో వైరల్ అయిన ఓ నంబర్ కు ఫోన్ చేసి రెమ్ డెసివిర్ కొనుగోలు చేసినట్లు తేలింది. ఫోన్ లో మాట్లాడిన ఆ వ్యక్తి ఆరు సీసాల రెమ్ డెసివిర్ కోసం రూ.18000 డిమాండ్ చేశాడు. ఆ మహిళ డబ్బును చెల్లించిన మరుసటి రోజే రెమ్ డెసివిర్ డెలివరీ అయిందని ఆ మహిళ కంప్లైంట్ లో పేర్కొంది.