ఏడాది పొడవునా ఫలాలనిచ్చే మునగ చెట్టు.. చెట్టంతా ఆరోగ్య ప్రయోజనాలే

ఏడాది పొడవునా ఫలాలనిచ్చే మునగ చెట్టు.. చెట్టంతా ఆరోగ్య ప్రయోజనాలే

భారతదేశం అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్న అనేక మెుక్కలు, చెట్లకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఏడాది పొడవునా ఫలాలను ఇచ్చే వాటిలో మునగ చెట్టు ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే.. దాని పండ్లు, ఆకులు రెండూ కూడా గొప్ప ఔషధ విలువలను కలిగి ఉంటాయి. ఇవి సాధారణ, తీవ్రమైన వ్యాధులను సైతం నయం చేయడంలోనూ సహాయపడతాయి.

మునగ లేదా ముంగా చెట్టుగా ప్రఖ్యాతిగాంచిన ఈ చెట్టు బొటానికల్ పేరు మోరింగా ఒలీఫెరా. ఇది బహుళార్ఖసాధక చెట్టు. దీన్ని ఇతర ప్రాంతాల్లో సహజన్, సుజనా, సెంజన్ అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ చెట్టు భాగాల్లో అనేక పోషకాలుంటాయి. ఈ చెట్టు మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఏడాది పొడవునా కాయలను ఇస్తుంది. వీటి పొడవు 3 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మునగ కాయ పొడవు 1 అడుగు లేదా ఒకటిన్నర అడుగుల వరకు మాత్రమే ఉంటుంది.

చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో..

మునగ కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల శరీరంలో మంట వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల రోగి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. అంతే కాదు నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటి కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది.

300 కంటే ఎక్కువ వ్యాధుల చికిత్సకు...

ఆయుర్వేదంలో మునగ కాయను 300 కంటే ఎక్కువ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. దీన్ని అద్భుత చెట్టు అని కూడా అంటారు. చెట్టులోని ఔషధ గుణాలు జుట్టు రాలడం, ఉబ్బసం, కీళ్ల నొప్పులు వంటి సాధారణ వ్యాధులకు చికిత్స చేయడంలో మధుమేహం, బోలు ఎముకల వ్యాధి వంటి చికిత్సలోనూ సహాయపడుతుంది.

ఊబకాయం, బరువు తగ్గడంలో..

మునగ ఆకులు ఊబకాయాన్ని, బరువు తగ్గించడంలోనూ సహాయపడతాయి. డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ ఆకులు ప్రయోజకరంగా ఉంటాయి. శరీరంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి కూడా ఇది దోహదపడుతుంది. కానీ దీన్ని తీసుకునే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది

మునగ ఆకులు ఆరోగ్యకరమైన ఎముకలకు అవసరమైన కాల్షియం, మెగ్నిషియం, భాస్వరం వంటి వాటిని అందిస్తుంది. ఎముక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. రక్తాన్ని శుభ్రచేయడంలో దోపదపడుతుంది. మునగ ఆకుల రసాన్ని రోజూ తాగవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరంలోని హానికరమైన పదార్థాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.

ఉదర సమస్యలకు..

మునగ ఆకులను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, అల్సర్ వంటి అనేక కడుపు సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. ఇందులో ఉండే పీచు, జీర్ణ వ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచి, ఆరోగ్యకరమైన పేగు కదలికకు కూడా దోహదపడుతుంది. ఇది రక్త హీనతను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.