మున్సిపల్ ఎలక్షన్స్ లో  ఫిర్యాదులు లేవు.. దాడులూ లేవు..

మున్సిపల్ ఎలక్షన్స్ లో  ఫిర్యాదులు లేవు.. దాడులూ లేవు..

ఎన్నికల్లో డబ్బు, మద్యం, కానుకల పంపిణీని అడ్డుకోవడానికి ఎలక్షన్‌‌ కమిషన్ బహుళ అంచెల వ్యవస్థను వినియోగింసీచింది. ఇందులో ఫ్లయింగ్‌‌ స్క్వాడ్‌‌, స్టాటిక్‌‌ సర్వైలెన్స్ టీమ్స్, నిఘా టీమ్స్ క్షేత్రస్థాయిలో పనిచేశాయి. విజిల్ యాప్ ద్వారా పౌరులు నేరుగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనుమానాస్పద కదలికలను పర్యవేక్షిస్తూ నగదు, బహుమతుల పంపిణీపై దాడులు నిర్వహించారు. స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ కీలకమైన ప్రాంతాలు, సరిహద్దులు, చెక్‌‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు చేశారు. ఖర్చు పరిశీలకులు అభ్యర్థుల ఎన్నికల వ్యయాలను నిశితంగా గమనించారు. పోలీస్ సిబ్బంది లాఅండ్‌‌ఆర్డర్‌‌ను పర్యవేక్షిస్తూ అక్రమ కార్యకలాపాలను అడ్డుకోకున్నారు.

 కానీ ఈ టీమ్‌‌లన్నీ నామమాత్రంగానే పనిచేస్తున్నాయని విమర్శలు వచ్చాయి. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తేనే స్పందించాయి. తాజా ఎన్నికల్లో ఇలాంటి టీమ్‌‌లు ఏర్పాటుచేశారన్న కనీస సమాచారమూ లేదు. ఎక్కడా చెక్‌‌పోస్టులు, మోతాదుకు మించిన నగదు తరలింపును అడ్డుకునే వ్యవస్థే కనిపించలేదు. ప్రచార గడువు ముగిసినప్పటి నుంచి ప్రతి వార్డులో డబ్బుల పంపిణీ పట్టపగలే, బహిరంగంగానే జరిగినా పోలీసులు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు వచ్చాయి.

 ప్రత్యర్థిని బట్టి కొన్ని వార్డుల్లో రెండోసారి డబ్బులు పంపిణీ చేసినా, నిఘా వ్యవస్థ మాత్రం నిద్ర నటించింది. దీంతో నగదు పంపిణీ అంతా బహిరంగ రహస్యంగానే మారింది. ఇక అభ్యర్థుల హంగూఆర్భాటాలతో ప్రచారానికి లక్షలు ఖర్చు పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వారు సమర్పించే తప్పుడు లెక్కలనే ఎన్నికల సంఘానికి నివేదిస్తున్నాయి. ఇక అధికారులు, పోలీసులు ఎలాగూ రూలింగ్​పార్టీ పంపకాలకు అడ్డు చెప్పరు. ఇదే అదనుగా ఇతర పార్టీల అభ్యర్థులు దొంగచాటుగా ఆ పని పూర్తి చేశారు.