మున్పి పల్ ఎన్నికల ప్రచారం..కాంగ్రెస్ నుంచి 20 మంది స్టార్ క్యాంపెయి నర్లు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మున్పి పల్ ఎన్నికల ప్రచారం..కాంగ్రెస్ నుంచి 20 మంది స్టార్ క్యాంపెయి నర్లు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     సీఎంతో సహా 16 మంది  కేబినెట్ మంత్రుల ప్రచారం

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు 20 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ జాబితాను గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అందించారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి సహా 16 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. 

వీరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు వంటి సీనియర్లు ఉన్నారు. అలాగే, పార్టీ తరఫున మరో నలుగురికి అవకాశం దక్కింది. వారిలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్, మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి, మాజీ ఎంపీ వి. హన్మంతరావు ఉన్నారు.