పారిశుధ్య కార్మికురాలిని లైంగికంగా వేధించిండు... వీడియోలు వైరల్

 పారిశుధ్య కార్మికురాలిని లైంగికంగా వేధించిండు... వీడియోలు వైరల్

హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో పారిశుధ్య కార్మికురాలిని లైంగికంగా వేధిస్తున్న వీడియోలు బయటపడ్డాయి. గాజులరామారం సర్కిల్ సూరారంలో ఎస్ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న కిషన్ అనే వ్యక్తి తనకింద పనిచేస్తున్న ఓ మహిళ కార్మికురాలి గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు.  తాను చెప్పినట్లు వినకుంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టాడు. 

అధికారి వేధింపులకు తాళలేక ఎవరికి చెప్పలేక నరక యాతన అనుభవిస్తున్న కార్మికురాలు అతని చెరలో పడక తప్పలేదు. అంతటితో ఆగకుండా ఈ తతంగం మొత్తాన్ని తన ఫోన్ లో వీడియోలు తీశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వేధింపులకు గురిచేసిన వ్యక్తిని సస్పెండ్ చేసి, నిందితుడిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు అధికారులు. 

కాగా జంట సర్కిల్ పరిధిలో గతంలోనూ ఇలాం టి వ్యవహారాలు బయటపడ్డాయి. తాజాగా ఈ వ్యవహారంపై కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది.