- శాంతించిన ‘మున్నేరు’.. ఇండ్లను శుభ్రం చేసుకుంటున్న ముంపు ప్రాంతాల ప్రజలు
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలతో రెండు రోజులుగా ఖమ్మం మున్నేరు నది 25 అడుగుల నీటి మట్టంతో పరవళ్లు తొక్కుతూ గురువారం ఉగ్రరూపం దాల్చింది. దీంతో నది పరివాహక ప్రాంతంలో ఇండ్లలోకి వరద వచ్చింది. బొక్కల గడ్డ, వెంకటేశ్వర నగర్ ఏరియాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.
పలు కుటుంబాలు ఇండ్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లాయి. కాగా, శుక్రవారం తెల్లవారుజామున నుంచి మున్నేరు వరద శాంతించడంతో ముంపుప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వారంతా తిరిగి ఇండ్లకు చేరుకోగా ఇండ్లన్నీ బురదమయంగా దర్శనమిచ్చాయి. బురదను క్లీన్ చేయడం, తడిసిన సామగ్రిని ఆరబెట్టడం, బట్టలు ఉతికి ఆరేయడంలో వారు నిమగ్నమైపోయారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు వాటర్ ట్యంకర్లతో రోడ్లన్నీ క్లిన్ చేశారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం
