
- రూ. 5వేల కోట్ల నిధులు మంజూరు చేయాలె
- తెలంగాణ మున్నూరు కాపు సంఘం
ఖైరతాబాద్,వెలుగు: కాంగ్రెస్ఎన్నికల మేనిఫెస్టోలో మున్నూరు కాపు ఫైనాన్స్కార్పొరేషన్ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిందని, పార్లమెంటు ఎన్నికలలోపు అమలు చేయాలని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్, మున్నూరు కాపు డెవలప్మెంట్ఫోరం అధ్యక్షుడు ఎడ్ల రవికుమార్, మున్నూరు కాపు యువత అధ్యక్షుడు బండి సంజీవ్పటేల్మాట్లాడారు.
పదేండ్లుగా మున్నూరు కాపు ఫైనాన్స్కార్పొరేషన్ఏర్పాటుకు ఉద్యమించినా గత ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వం హామీ మేరకు ఫైనాన్స్కార్పొరేషన్ఏర్పాటుతో పాటు రూ. 5 వేల కోట్ల నిధులు కేటాయించి, సంఘానికి 2 ఎకరాల స్థలం ఇవ్వాలని, 33 జిల్లాల్లోని మున్నూరు కాపు విద్యార్థులకు హాస్టళ్లను మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేళ్ల హరికృష్ణ, రాష్ట్ర కన్వీనర్చింతపండు మహేందర్పటేల్, వనమాల ప్రవీణ్‌పటేల్, గ్రేటర్హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్వీ మహేందర్తదితరులు పాల్గొన్నారు.