ఓటర్ల కాళ్లు మొక్కే కార్యక్రమం చేపట్టిన ఎన్ఎస్​యూఐ

ఓటర్ల కాళ్లు మొక్కే కార్యక్రమం చేపట్టిన ఎన్ఎస్​యూఐ

నల్గొండ, వెలుగు: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వినూత్న ప్రచారం చేస్తోంది. ఇదివరకే మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పాల్వాయి స్రవంతి మహిళలకు గాజులు తొడిగి, బొట్టు పెడుతూ ఓట్లడుగుతున్నారు. ఇదే క్రమంలో ఎన్ఎస్​యూఐ విభాగం లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కే కార్యక్రమం ఆదివారం చౌటుప్పుల్ మున్సిపాలిటీలో మొదలుపెట్టింది.

ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో కలిపి 8 వందల మంది ఎన్ఎస్​యూఐ కార్యకర్తలు 40 వేల గడపలకు వెళ్లి లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కనున్నారు. ఎన్ఎస్​యూఐ స్టేట్​ ప్రెసిడెంట్​ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ​నిర్వహిస్తున్నారు.

ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నారాయణ్ పూర్ మండలంలో లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆ బాధ్యతను ఎన్​ఎస్​యూఐ విభాగానికి అప్పగించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నారాయణ్ పూర్, పుట్టపాకలో పర్యటించనున్నారు.