మునుగోడు ఎన్నికల వేడి... పార్టీ మారిన వార్డు మెంబర్లు

మునుగోడు ఎన్నికల వేడి... పార్టీ మారిన వార్డు మెంబర్లు

మునుగోడు, నల్గొండజిల్లా: మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. ఎప్పుడొస్తాయో స్పష్టంగా తెలియకపోయినా.. రేపో మాపో అన్నట్లు రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తల హడావుడి పెరిగిపోయింది. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ప్రచారం చేసుకుంటూ.. నిత్యం స్థానికులతో మమేకం అవుతున్నారు. తమను ఎన్నుకున్న వార్డు ప్రజలకు తాము కూడా ఏమీ చేయలేకపోతున్నామంటూ అసంతృప్తితో ఉన్న పలువురు వార్డు సభ్యులు ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తనపై నమ్మకంతో అభివృద్ది చేయాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన వార్డు సభ్యులకు రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. మునుగోడు గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్,  5వార్డు, 12వ వార్డు 13వ వార్డు సభ్యులు, వారి అనుచరులు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.