రోడ్డు రోలర్ గుర్తును 5 నుంచి 14వ స్థానానికి మార్చిన్రు : శివకుమార్

రోడ్డు రోలర్ గుర్తును 5 నుంచి 14వ స్థానానికి మార్చిన్రు : శివకుమార్

తనకు వచ్చిన రోడ్డు రోలర్ గుర్తును మార్చేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు,  మునుగోడు అభ్యర్థి శివకుమార్  ఆరోపించారు. 5వ స్థానంలో ఉన్న రోడ్డు రోలర్ గుర్తును 14వ స్థానానికి,  4 వ స్థానంలో ఉన్న టీఆర్ఎస్ కారు గుర్తు 2 వ స్థానంలోకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. రోడ్డు రోలర్ కు వచ్చిన ఓట్లు కూడా తమ ఓట్లేనని మంత్రి కేటీఆర్ ప్రకటించడం సిగ్గుచేటని మండిపడ్డారు.14వ స్థానానికి మారడం వల్లే తమ రోడ్డు రోలర్ గుర్తుకు ఓట్లు పడలేదన్నారు.

మునుగోడు ఉపఎన్నికలో అన్ని రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడి ప్రజలను ప్రలోభ పెట్టాయని చెప్పారు. మొదటి నుంచీ కుట్రలు చేసిన టీఆర్ఎస్.. బీజేపీపైకి నెపాన్ని నెట్టడం సరికాదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలను రద్దు చేసి... తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని శివ కుమార్ స్పష్టం చేశారు. ఆ వీడియో బైట్స్ ను ఆయన మీడియా ప్రతినిధులకు చూపించారు.