
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో బాది పెట్రోల్ పోసి నిప్పు అంటించారు దుండగులు. నారాయణ్ ఖేడ్ మండలం జుక్కల్ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వెనక అడవి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది . స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నారాయణ్ ఖేడ్ సీఐ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం ‘ ఈ మర్డర్ రెండు నుండి మూడు రోజులు క్రితం జరిగినట్లు తెలుస్తుంది. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో విచారణ చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి వేసుకున్న షర్ట్ పై ఎంజి టైలర్ సదాశివపేట అని ఉంది. వివరాలు ఎవరికైనా తెలిస్తే నారాయణ్ ఖేడ్ పోలీసులకు సమాచారం ఇవ్వండి ‘ అని చెప్పారు.