
హైద్రాబాద్ శంషాబాద్ లో వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు. తోండుపల్లి గ్రామ శివారులో బండ రాళ్లతో వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు దుండగులు. శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్వ్యాడ్ లో తనిఖీలు చేశారు. మూడు రోజుల క్రితం శంషాబాద్ మండలంలోని సిద్దాంతి బస్తీ స్మశాన వాటిక సమీపంలో పద్దమ్మ అనే మహిళను హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.