హంతకుడిని పట్టిచ్చిన సెల్ఫీ

హంతకుడిని పట్టిచ్చిన సెల్ఫీ
  • హంతకుడిని పట్టిచ్చిన సెల్ఫీ

ముంబై: రైల్లో ప్రయాణిస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా అతడి ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడో దొంగ. అలర్ట్ అయిన ప్రయాణికుడు అతడికి తన ఫోన్​ను చిక్కనివ్వలేదు. చేసేదేంలేక ఆ దొంగ పరారయ్యాడు. పారిపోతున్న అతడిని ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాని ఆధారంగా పోలీసులు దొంగను పట్టుకున్నారు. ఆ దొంగ వద్ద ఉన్న గతంలో చోరీ చేసిన ఫోన్​ ఆధారంగా పోలీసులు మరో ప్రయాణికుడి డెత్​ మిస్టరీని ఛేదించారు. మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.జాహీద్ అనే ప్యాసింజర్ రైల్లో సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా ఆకాశ్ జాదవ్ ఫోన్ కొట్టేసేందుకు ప్రయత్నించాడు. జాహీద్ ఎదురుతిరగడంతో ఆకాశ్ పారిపోయాడు. ఈ క్రమంలో రికార్డయిన వీడియో ఆధారంగా పోలీసులు ఆకాశ్​ను గురువారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్​ను గతంలో రైల్వే ట్రాక్​పై పడి ప్రాణాలు కోల్పోయిన పుణె వాసి ప్రభాస్ బాంగేదిగా గుర్తించారు. జాదవ్ ఫోన్ దొంగిలించే క్రమంలోనే ప్రభాస్ రైల్లోంచి కిందపడ్డాడని విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.