హైదరాబాద్ నగరం రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మెగా ప్రాజెక్టు పనుల కోసం ఏకంగా రూ.7,345 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
తొలి విడతలో భాగంగా జోన్-1ఏ, జోన్-1బీ ప్రాధాన్య కారిడార్లలో ఈ మూసీ అభివృద్ధి పనులు జరగనున్నాయి. మొత్తం 21 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాధాన్య స్ట్రెచ్‌లో రివర్‌ఫ్రంట్ పనులను చేపట్టబోతున్నారు.
ఇందులో మొదటిది హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కిలోమీటర్ల మేర, అలాగే.. ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు మరో 11.80 కిలోమీటర్ల మేర మూసీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అయితే ప్రభుత్వం కేటాయించిన రూ.7,345.12 కోట్ల నిధులు కేవలం అభివృద్ధి పనుల కోసమేనని, ఇందులో భూసేకరణ వ్యయం కలపలేదని స్పష్టం చేసింది.
మరి ఇంత భారీ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తోందంటే.. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) నుంచి రూ.4,500 కోట్ల రుణాన్ని తీసుకోనున్నారు. ఇక మిగిలిన రూ.2,845 కోట్ల నిధులను HMDA , TGIIC బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సమకూర్చనున్నారు.
ఈ మెగా ప్రాజెక్టును అత్యంత పారదర్శకంగా.. ఈపీసీ (EPC - Engineering, Procurement, and Construction) విధానంలో చేపట్టనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం, ఏడీబీ (ADB) మార్గదర్శకాలకు లోబడే ఈ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ జరగనుంది. అంతేకాదు.. పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ (PMC) నియమించేందుకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి చర్యలు వేగవంతం చేయాలని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MRDCL) ను ప్రభుత్వం ఆదేశించింది.
