Mahindra XEV 9e: మహీంద్రా లేటెస్ట్ ఈవీ కార్ కొన్న ఏఆర్ రెహమాన్.. కారు ఫీచర్స్ ఇవే..

Mahindra XEV 9e: మహీంద్రా లేటెస్ట్ ఈవీ కార్ కొన్న ఏఆర్ రెహమాన్.. కారు ఫీచర్స్ ఇవే..

AR Rahman: ఇటీవలి కాలంలో దేశంలో ఈవీల వినియోగం భారీగా పెరుగుతోంది. పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం తమ వద్ద ఎన్ని ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల వైపు మెుగ్గుచూపుతున్నారు. వారి గ్యారేజీలో సరికొత్త ఈవీలకు చోటు కల్పిస్తున్నారు. 

ఈ క్రమంలోనే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దేశీయ ఆటోమేకర్ తయారు చేసిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇ డెలివరీ తీసుకున్నారు. అయితే రెహమాన్ కి ముందు బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్ కూడా ఈ మోడర్ కారును డెలివరీ తీసుకున్నారు. రెహమాన్ తాజాగా ట్యాంగో రెడ్ కలర్ కారును సొంతం చేసుకున్నారు. ట్రైయాంగులర్ హెడ్ లైట్స్ కలిగి ఉన్న ఈ ఎస్ యూవీ డిజైన్ కారుకు ప్రస్తుతం మార్కెట్లో మంచి క్రేడ్ ఉంది. ఒకపక్క మరో దేశీయ దిగ్గజం టాటా కూడా కర్వ్ వంటి ఈవీ మోడళ్లను లాంచ్ చేస్తున్నప్పటికీ మహీంద్రా కూడా ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తోంది. 

ప్రస్తుతం ఈ మోడల్ కారు ధర రూ.21లక్షల 90వేల నుంచి ప్రారంభ ధరతో అందుబాడులో ఉంది. ఈ మోడల్ టాప్ ఎండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.30లక్షల 50వేలుగా ఉంది. ప్రస్తుతం ఈ కారును కంపెనీ 59 కిలోవాటవర్, 79 కిలోవాటవర్ మేరియంట్లలో కొనసాగుతోంది. కారు కేవలం 20 నిమిషాల చార్జ్ చేస్తే 20 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. 79 కిలోవాటవర్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ట్రావెల్ రేంజ్ అందిస్తోంది.