నా పాట సినిమాకి హెల్పవ్వాలి

నా పాట సినిమాకి హెల్పవ్వాలి

 టాలీవుడ్‌‌ టాప్‌‌ మ్యూజిక్‌‌ డైరెక్టర్స్‌‌లో ఒకడైన తమన్.. నంబర్‌‌‌‌ గేమ్‌‌ని అస్సలు నమ్మనంటున్నాడు. తాను సంగీతం అందించిన ‘అఖండ’ సినిమా డిసెంబర్ 2న విడుదల కానున్న సందర్భంగా మనసులోని మాటల్ని ఇలా పంచుకున్నాడు. ‘‘మరో వంద సినిమాలు చేసినా బాలకృష్ణ, బోయ పాటి కాంబినేషన్‌‌లో ఫ్లాప్ రాదు. వాళ్ల అండర్‌‌‌‌ స్టాండింగ్‌‌ అంత గొప్పది. ఏ సినిమా అయినా ఎమోషన్ ఉంటే  కచ్చితంగా మెప్పిస్తుంది. ఇందులో అలాంటి ఎమోషన్‌‌తో పాటు ఫైర్ ఉంది. బాలకృష్ణ అదరగొట్టారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదిది. నెవర్ బిఫోర్, నెవర్ అగైన్ కాన్సెప్ట్. అఘోరాకి సంబంధించి చాలా రీసెర్చ్ చేసి, కొన్ని బుక్స్ కూడా చదివాను. ఆ పాత్రకి సంబంధించిన మ్యూజిక్ అంతా ఆథెంటిక్‌‌గా ఉంటుంది. నాలుగు పాటలుంటాయి. రెండు రిలీజయ్యాయి. ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో  మరో రెండు విడుదలౌతాయి. సినిమాకి అవసరం లేదని ఓ పాట తీసేశాం. లోకల్ 'సింగర్స్‌‌తోనే ఎక్కువపాడిస్తున్నా.

ఈ సినిమా టైటిల్‌‌ సాంగ్ మాత్రం శివుడి గురించి కావడంతో శంకర్ మహదేవన్ పాడితేనే కరెక్టనిపించింది. కంపోజ్ చేయడానికి దాదాపు నెల పట్టింది. ఈ పాట రావడానికి ముందు, తర్వాత సీన్స్ చూసి మరీ పర్ఫెక్ట్‌‌గా ప్లాన్ చేశాం. కొన్నిచోట్ల డైలాగ్ వెర్షనే పాటలా ఉంటుంది. డైరెక్టర్‌‌‌‌ మ్యూజిక్‌‌కి ఇచ్చే స్పేస్‌‌ని బట్టే బ్యాగ్రౌండ్‌‌ స్కోర్ ఆధారపడి ఉంటుంది. బోయపాటి చాలా స్పేస్ ఇచ్చారు. రెండు నెలల ముందే ఆర్‌‌‌‌ఆర్ పూర్తయింది. రిలీజ్ డేట్‌‌ మారడంతో మరింత బెస్ట్ ఇవ్వాలని రీవర్క్ చేశా. ‘అల వైకుంఠపురంలో’ తర్వాత మ్యూజిక్ అనేది పెళ్లికి ముందు ఇచ్చే ఇన్విటేషన్‌‌లా మారింది. అందుకే సాంగ్స్‌‌ని వీలయినంత బాగా జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.  పాటల్లో సింగర్స్‌‌ని చూపించడం పర్సనల్‌‌గా వాళ్లకి హెల్పవుతోంది. సింగిల్ సాంగ్స్ రిలీజ్ చేయడం సినిమా ప్రమోషన్‌‌కి, ఆడియో సంస్థలకి ఉపయోగపడుతోంది. కరోనా కారణంగా సినిమాలు ఆలస్యమవడంతో నా చేతిలో ఎక్కువ సినిమాలు కనిపిస్తున్నాయి. అంతే తప్ప నేను నంబర్‌‌‌‌ గేమ్‌‌ని నమ్మను.  నా పాట హిట్టైతే చాలని ఎప్పుడూ అనుకోను. ఎందుకంటే నేను చేసేది ఆల్బమ్ కాదు. సినిమా కూడా హిట్టవ్వాలి. దానికి నా పాట హెల్పవ్వాలి.’’