
ఆగస్ట్ 5న ఉత్తరప్రదేశ్ అయోద్యలో రామమందిర నిర్మాణ శంకుస్థాపన జరగనుంది. ఇందుకు సంబంధించి పూజాకార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
మరో వైపు రామమందిర నిర్మాణం నేపథ్యంలో హిందూ – ముస్లీంల మతసామరస్యం వెల్లివిరుస్తోంది. అందుకు నిదర్శనమే ఇక్రాఖాన్
వారణాసికి చెందిన ఇక్రాఖాన్ హిందూ – ముస్లీంల మతసామరస్యాన్ని గుర్తు చేస్తూ చేతిపై శ్రీరాం అని పచ్చబొట్టు వేయించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయోద్యలో రామమందిర నిర్మాణంపై ముస్లీం సోదరులు సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ క్షణం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. నేను ప్రధాని నరేంద్ర మోడీ అభిమానిని అని ఇక్రా ఖాన్ తెలిపింది.
ఇక్రాఖాన్ పచ్చబొట్టుపై షాక్ గురైనట్లు ఆ షాప్ యజమాని అశోక్ గోగియా చెప్పాడు. వారణాసిలోని సిగ్రా నగరంలో టాటూ షాపు నడుపుతున్నానని, ఇక్రా ఖాన్ ప్రేరణతో అయోద్యలో భక్తులకు ఉచితంగా టాటూ వేస్తున్నట్లు టాటూయజమాని అశోక్ ఆఫర్ ప్రకటించాడు.