హిందూ సాధువుకోసం..మదీనాలో ముస్లిం యువకుడి ప్రార్థనలు..వీడియో వైరల్

హిందూ సాధువుకోసం..మదీనాలో ముస్లిం యువకుడి ప్రార్థనలు..వీడియో వైరల్

హిందూ సాధువుకోసం ముస్లిం యువకుడి ప్రార్థనలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల హార్ట్​ ను గెలుచుకున్నాయి. హిందూ ఆథ్యాత్మక గురువు ప్రేమానంద్​ జీ మహారాజ్​ఆరోగ్యం బాగుపడాలని ముస్లింలకు పవిత్ర నగరం అయిన మదీనాలో అలహాబాద్ ముస్లిం యువకుడు చేసిన ప్రార్థనలకు సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. 

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ మత,హిందూ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ శ్రేయస్సు కోసం ఒక ముస్లిం వ్యక్తి ప్రార్థిస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో క్లిప్‌లో.. ప్రేమానంద్ జీ మహారాజ్ త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కోసం అలహాబాద్‌ కు చెందిన సూఫియాన్  మదీనాలో ప్రార్థనలు చేస్తూ కనిపించారు.ఇది అన్ని వర్గాల ప్రజలనుంచి ప్రశంసలు అందుకుంది. సూఫియాన్​ ను అందరూ పొగడ్తలతో ముంచెత్తారు.  ఇది మతపరమైన సరిహద్దులను చెరిపేసి సామరస్యం, కరుణను సూచిస్తుంది. భారత్​ లో భిన్నత్వంలో ఏకత్వానికి ఇది ఒక ఉదాహరణ అంటున్నారు నెటిజన్లు. 

ఒక నిమిషం 20 సెకన్ల నిడివి గల వీడియోలో.. బృందావనం సాధువు త్వరగా కోలుకోవాలంటూ ఇస్లాం పవిత్ర ప్రదేశాల్లో ఒకటైన మదీనాలో సూఫియాన్​ ప్రార్థన చేస్తున్నట్లు కనిపించారు. వీడియోలో సుఫియాన్ తన ఫోన్ పట్టుకుని ప్రేమానంద్ జీ మహారాజ్ చిత్రం వైపు చూపిస్తూ సాంప్రదాయ ముస్లిం ప్రార్థన భంగిమలో చేతులు పైకెత్తి ప్రార్థనలు చేశాడు. ఓ అల్లాహ్​ భారతదేశ గొప్ప సాధువు ప్రేమానంద్​ మహారాజ్​ ను త్వరగా ఆరోగ్యవంతుడిని చెయ్యి.. ఆయన తిరిగి భక్తులకు మార్గనిర్దేశం చేసేలా చెయ్యి  అని ప్రార్థించనట్లు వీడియోలో వినిపిస్తోంది. 

నేను గంగా యమునా సంగమం ప్రయాగ్​ రాజ్​ నుంచి వచ్చాను. ప్రేమానంద్​ మహారాజ్​ చాలా మంచి వ్యక్తి .. ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు తెలిసింది. నేను ఇప్పుడు ఖిజ్రాలో ఉన్నాను. ప్రేమానంద్​ మహారాజ్​ కు ఆరోగ్యం ప్రసాదించాలని అల్లాహ్​ను ప్రార్థిస్తున్నాను. అని సూఫియాన్​ చెప్పడం వీడియోలో వినిపిస్తోంది.  హిందూ,ముస్లిం అనేది పట్టింపు లేదు. మంచి,నిజమైన వ్యక్తిగా ఉండటం ముఖ్యం అని సూఫియాన్ చెప్పడం అందరిని ఆకట్టుకుంది. 

రిపోర్టుల ప్రకారం.. ప్రేమానంద్​ మహారాజ్​ ఆటో సోమల్ డామినెంట్ పాలిసిస్టిక్​ కిడ్నీ  వ్యాధిలో బాధపడుతున్నారు. దీంతో ఆయన రెండు మూత్రపిండాలు చెడిపోయినట్లు తెలుస్తోంది. ప్రేమానంద్ మహారాజ్ కు ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో ఆశ్రమం ఉంది. ప్రేమానంద్​ ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తులలో బాగా ప్రాచుర్యం పొందాయి.

నెటిజన్లు ఏమంటున్నారంటే.. 

సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పటికే వేల సంఖ్యలో  నెటిజన్లు చూశారు. అంతే రేంజ్​ లో చేస్తున్నారు. సూఫియాన్ చర్య స్ఫూర్తిదాయం.. ప్రపంచానికి ప్రస్తుతం అవసరమైన మేసేజ్​ అని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ వీడియో మాకు మానవత్వానికి నిజమైన అర్థాన్ని నేర్పిందని ఓ నెటిజన్​ చెప్పడం ఆ వీడియో ఎంతగా ఆకట్టుకుందో తెలుస్తోంది. 

డాక్టర్​ అబ్దుల్ కలాం సర్​ లాగానే చెప్పారు అని ఒక నెటిజన్​ చెప్పగా.. నాకు ఇలాంటి భారత దేశం కావాలి మరో నెటిజన్​రాశారు. 
అమీన్​.. మన మాతృభూమిలో శాంతి , సోదరభావం, సామరస్యం నెలకొనాలి.. జై భారత్.. అని మరో నెటిజన్​రిప్లై ఇచ్చారు. 

ప్రేమానంద్​కు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకొచ్చిన ముస్లిం దాత.. 

గతంలో జబ్బున పడ్డప్పుడు ప్రేమానంద్​ మహారాజ్​ కు కిడ్నీ ఇచ్చేందుకు ఓ ముస్లిం డోనర్​ముందుకొచ్చాడు. హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా అరిఫ్​ ఖాన్​ అనే 26ఏళ్ల యువకుడు కిడ్నీ దానం చేస్తానంటూ ప్రేమానంద్ మహారాజ్​ కు లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలోని ఇటార్సి పట్టణంలోని న్యాస్ కాలనీ నివాసి అరిఫ్​ ఖాన్​.. కలెక్టర్ సోనియా మీనా కార్యాలయం ద్వారా హిందూ సాధువుకు లేఖను పంపారు. నేను బతికి ఉన్నా లేకపోయినా.. మీ జీవితం ఈ ప్రపంచానికి చాలా విలువైనదంటూ అరిఫ్​ ఖాన్​ లేఖలో రాయడం విశేషం.