
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 2024 జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జగరనుంది. రామమందిర పునప్రారంభం, ఆలయంలో శ్రీరాముని విగ్రహప్రతిష్టాపన అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆలయట్రస్టు నిర్వాహకులు. ఈకార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కాను న్నారు. అయితే రామమందిరం ప్రారంభోత్సవంలో భాగంగా ప్రతిష్టించే రాముడి విగ్రహ ప్రతిమలను పశ్చిమ బెంగాల్ లోని ముస్లిం శిల్పులు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ జిల్లో 24 పరగణాల జిల్లాకు చెందిన ఇద్దరు ముస్లిం శిల్పులు ఉత్తర ప్రదేశ్ లో జరగబోయే రామమందిర ప్రారంభొత్పవం కోసం రాముడి విగ్రహ ప్రతిమలను రూపొందించారు. మహ్మద్ జమాలుద్దీన్, అతని కుమారుడు బిట్టు ఆలయంలో ప్రతిష్టంచే ఈ అద్భుతమైన విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఆన్ లైన్ ఈ ముస్లిం శిల్పుల గురించి తెలుసుకొని వీరికి అయోధ్య ట్రస్టు నుంచి ఆర్డర్ ఇచ్చారు.
అయితే ఒక ముస్లిం శిల్పులు అయిన మీరు హిందూ దేవుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు..ఈ ప్రాజెక్టు గురించి మీకు తెలుసా అని అడిగితే జమాలుద్దీన్ ఇలా సమాధానమిచ్చారు. ‘‘మతం అనేది వ్యక్తిగతం. దేశంలో వివిధ మతాలకు చెందిన వారున్నారు..మతతత్వ కాలంలో మనందరం కలిసిఉండాలి. నేను రాముడి విగ్రహాన్ని తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సోదర సంస్కృతి ఒక కళాకారుడిగా నా సందేశం ’’ అంటూ జమాలాద్దీన్ చెప్పారు.
రాముడికే కాదు.. మా దుర్గ, జగదాత్రి భారీ శిల్పాలను కూడా తయారు చేశారు. అవి ఎంతో ప్రజాదరణ పొందాయని జమాలుద్దీన్ చెప్పారు. ఏళ్ల తరబడి హిందూ దేవతల ఫైబర్ శిల్పాలను తయారు చేస్తున్నానని తెలిపారు. అవి ప్రాతినిధ్యం వహిస్తున్న సాంస్కృతిక సామరస్యాన్ని ఎంతో ఆదరిస్తు్న్నానని సగర్వంగా చెప్పాడు జమాలుద్దీన్.
జమాలుద్దీన్ కుమార్ బిట్లు మాట్లాడుతూ..35 మంది శిల్పుల బృందంతో ప్రతిష్టాత్మకమైన రాముడి విగ్రహాన్ని తయారు చేస్తున్నాము. దీనికి రూపొందించేందుకు 45 రోజుల సమయం పడుతుంది.. యూపీకి రవాణా చేసేందుకు మరో 45 రోజులు పడుతుందని జమాలుద్దీన్ కుమారుడు , యువ శిల్పి బిట్టు తెలిపారు.