V6 News

గిరిజన చట్టాలపై అవగాహన ఉండాలి .. ములుగు కలెక్టర్ అధికారులకు శిక్షణా కార్యక్రమం

గిరిజన చట్టాలపై అవగాహన ఉండాలి .. ములుగు కలెక్టర్ అధికారులకు శిక్షణా కార్యక్రమం

ములుగు/ వెంకటాపూర్, వెలుగు: అధికారులు గిరిజన చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించకూడదని ములుగు కలెక్టర్ దివాకర చెప్పారు. శనివారం కలెక్టరేట్ లో అటవీ హక్కులు, గిరిజన చట్టాలపై అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్, ఐటీడీఏ ఏపీవో నాగోరావు తదితరులు పాల్గొన్నారు