ఇంధన కంపెనీల నుంచి సరఫరాలో అంతరాయం, డీలర్లకు ‘నో క్రెడిట్’ విధానంతో పెట్రోల్బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 43 బంకులు ఉండగా, పలుచోట్ల డీజిల్ నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. నాలుగైదు రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ విషయంలోనూ ఇలాగే జరుగుతుందని, స్టాక్ ఉన్నచోట భారీ క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని వాహనదారులు చెబుతున్నారు. - వెలుగు, భద్రాద్రికొత్తగూడెం

