V6 News

కివి పబ్లిక్ స్కూల్ 24వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్

కివి పబ్లిక్ స్కూల్ 24వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్

ఖిలా వరంగల్ ( కరీమాబాద్), వెలుగు: పట్టణంలోని ఉర్సుగుట్ట వద్ద ఆకుతోట కన్వెన్షన్ లో కివి పబ్లిక్ స్కూల్ 24వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ శనివారం వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి పాఠశాల వ్యవస్థాపకులు, ప్రిన్సిపల్ దాసి సతీశ్​మూర్తి హాజరై మాట్లాడుతూ పేద, మధ్యతరగతికి చెందిన విద్యార్థుల కోసం చక్కటి పునాది ఏర్పాటు చేసే దిశలో పాఠశాల శిక్షణ వారికి అందుబాటులో ఉందన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన కాజీపేట రైల్వే సీఐ వడ్డే నరేశ్​కుమార్ మాట్లాడుతూ పిల్లలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మధైర్యం నింపేలా పాఠశాల పనిచేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నడిపెల్లి వెంకటేశ్వరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ, వైస్ ప్రిన్సిపల్ అన్నదేవర ప్రవీణ్ కుమార్, పాఠశాల డైరెక్టర్ దాసిరజని తదితరులు పాల్గొన్నారు.