ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమాన ప్రమదం జరిగింది. ఢిల్లీ నుంచి జూరిచ్ వెళ్తున్న స్విస్ ఫ్లైట్ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో టెక్నికల్ లోపం తలెత్తడంతో మంటలంటున్నాయి.పైలట్ అప్రమత్తతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. అయితే విమానం నుంచిప్యాసింజర్స్ దిగే క్రమంలో తొక్కసలాట కారణంగా ఆరుగురికి గాయాలయ్యాయి.
ఆదివారం ఏప్రిల్ 26 తెల్లవారు జామున ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి జూరిచ్ బయల్దేరింది స్విస్ ఫ్లైట్.. రన్ వేపై వేగం పుంజుకుంటుండగా ఇంజిన్ లో టెక్నికల్ లోపం గుర్తించారు ఫైలట్. వెంటనే స్పందించి ఫ్లైట్ టేకాప్ క్యాన్సిల్ చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఇంజన్ లో టెక్నికల్ లోపం కారణంగా మంటలంటుకున్నాయి. ఈ ఘటనతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టారు ఎయిర్ పోర్టు అధికారులు. సిబ్బందిని అత్యవసర స్లైడ్‌ల ద్వారా సురక్షితంగా బయటకు తరలించగా, మరికొందరికి మెట్ల ద్వారా సహాయం అందించారు. అయితే విమానం దిగే సమయంలో ప్రయాణికుల్లో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 228 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు పసిపిల్లలు ఉన్నారు. టెక్నికల్ లోపానికి గల కారణాలను తనఖీ చేస్తున్నారు ఎయిర్ పోర్టు టెక్నికల్ సిబ్బంది.

