వాట్సాప్ ప్లస్ అనేది మెటా కొత్తగా తీసుకొస్తున్న ఒక స్పెషల్ పెయిడ్ సర్వీస్. మరిన్ని కొత్త ఫీచర్లు కావాలనుకునే వాళ్ల కోసం దీన్ని డిజైన్ చేశారు. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే యూజర్లు తమకు నచ్చిన థీమ్స్ మార్చుకోవచ్చు. దాదాపు 20 ఇంపార్టెంట్ చాట్ లను పిన్ చేసుకోవచ్చు. అలాగే స్పెషల్ స్టిక్కర్లు, రింగ్ టోన్లను వాడుకోవచ్చు. సాధారణ మెసేజింగ్, కాల్స్ వంటి సేవలు ఎప్పటిలాగే ఉచితంగా కొనసాగుతాయి. ప్రస్తుతం ఇది కేవలం కొందరు బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటు లోకి వచ్చే
వాట్సాప్ ప్లస్ సబ్ స్క్రిప్షన్ యాక్టివేట్ చేసుకోవాలంటే...
ముందుగా ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ సబ్స్క్రిప్షన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో వాట్సాప్ ప్లస్ పై క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూ పై ట్యాప్ చేసి, పేమెంట్ వివరాలను సరిచూసుకోవాలి. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా చెల్లింపును కన్ఫర్మ్ చేయాలి. ఈ ఆప్షన్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేదు. సెట్టింగ్స్ లో 'సబ్ స్క్రిప్షన్స్' అనే ఆప్షన్ కనిపించకపోతే ఈ ఫీచర్ ఇంకా మీకు రాలేదని అర్థం. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఉండాలి. ప్రతినెల సబ్ స్క్రిప్షన్ ధర సుమారు రూ. 200 నుంచి రూ.250 వరకు ఉండొచ్చని అంచనా.
మీ ఫోన్లో వాట్సాప్ ప్లస్ ఆప్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికి... ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి, కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కలు లేదా మీ ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. సెట్టింగ్స్ మెనూలో సబ్ స్క్రిప్షన్స్ అనే ఆప్షన్ కోసం వెతకాలి. ఒకవేళ ఆ ఆప్షన్ కనిపిస్తే, దానిపైక్లిక్ చేయాలి. అప్పుడు వాట్సాప్ ప్లస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

