- సరిపడా నీళ్లు తాగాలి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీళ్లు తాగితే మంచిది. అలాగని దాహానికి మించి నీళ్లు తాగకూడదు.
- కొబ్బరినీళ్లలో పోషక ఖనిజాలు ఉంటాయి. ఇది ఎనర్జీ డ్రింక్ గా కూడా పని చేస్తుంది. కాబట్టి ఎండాకాలంలో పిల్లలు, పెద్దలు కొబ్బరినీళ్లు తాగితే మంచిది. వీటిలో ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మెగ్నీషియం), కార్బోహైడ్రేట్ లు వడదెబ్బ బారిన పడకుండా చేస్తాయి.
- వేసవిలో వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. మజ్జిగ తాగితే శరీరంలోని అధిక వేడి తగ్గి చల్లగా ఉంచుతుంది. ఇందులో క్యాల్షియం, ఫాస్పరస్ , పొటాషియం ఉంటాయి. దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- సబ్జాగింజల నీళ్లు తాగడం వల్ల ఎండ తాపం నుంచి ఉపశమనం వెంటనే లభిస్తుంది. అంతేకాకుండా దీనిలోని యాంటియాక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవల్స్ ను క్రమబద్ధీకరిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ప్రొటీన్లు, ఐరన్, విటమిన్– కె ఎక్కువగా
ఉంటాయి.
