ఎండాకాలంలో చర్మానికే కాదు.. గడ్డానికి కూడా లోషన్ తప్పనిసరి.. ఎందుకో తెలుసా..?

ఎండాకాలంలో చర్మానికే కాదు.. గడ్డానికి కూడా లోషన్ తప్పనిసరి.. ఎందుకో తెలుసా..?

గడ్డం(బియర్డ్ ) పెంచడం ప్రజెంట్ ఫ్యాషన్ ట్రెండ్. పెంచడం వరకు ఓకే కానీ, కేరింగ్ ని మాత్రం పక్కన పెట్టేస్తారు చాలామంది. కాస్త గడ్డం గురించి కూడా కేర్ తీసుకోవాలి. మరీ ముఖ్యంగా చిరాకు పుట్టించే ఈ వేడిగాలుల్లో ఇంకాస్త ఎక్స్ట్రా కేర్ తప్పనిసరి. 

మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో గడ్డం లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతుంది. ఆ సమస్యలలో చిక్కకూడదంటే ఎప్పటికప్పుడు గడ్డాన్ని ట్రిమ్ చేయాలి. అలాగే ఎండకి వెంట్రుకలు చిట్లిపోకుండా బియర్డ్ ఆయిల్స్ తో మసాజ్ చేయాలి. బియర్డ్ ఆయిల్స్ మాయిశ్చరైజర్ గా పనిచేసి గడ్డాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే వారానికి రెండు సార్లు మైల్డ్ షాంపూతో గడ్డాన్ని వాష్ చేయాలి. గడ్డం వాష్ చేసేటప్పుడు కండీషనర్ వాడాలి. క్రమం తప్పకుండా గడ్డాన్ని దువ్వుకోవాలి. 

హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తినాలి. అలాగే వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి అప్పుడే గడ్డం ఆరోగ్యంగా పెరుగుతుంది. 

ఎండవల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. అచ్చు అలాగే గడ్డం కూడా డ్రైగా మారుతుంది. అందుకే ఈ కాలంలో చర్మానికి రాసినట్టే గడ్డానికి సస్క్రీన్ లోషన్స్ రాయాలి. గడ్డం కోసమే తయారైన సస్క్రీన్ లోషన్స్ మార్కెట్ లో దొరుకుతాయి.