IPL 2025: యూఏఈ నుంచి ఇండియాకు: రెండు రోజుల్లో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఫాస్ట్ బౌలర్

IPL 2025: యూఏఈ నుంచి ఇండియాకు: రెండు రోజుల్లో ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఫాస్ట్ బౌలర్

బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ క్రికెట్ లో ఫుల్ బిజీగా మారాడు. ఈ బంగ్లా స్టార్ బౌలర్ రెండు రోజుల్లోనే రెండు దేశాలు మారి మ్యాచ్ ఆడడం విశేషం. శనివారం (మే 17) యూఏఈ, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో ముస్తాఫిజుర్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి  రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్య్ లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

ALSO READ | IPL 2025: బెంగళూరు బ్యాడ్‌లక్.. RCB, సన్ రైజర్స్ మ్యాచ్‌కు వేదిక మార్చిన బీసీసీఐ

యూఏఈతో మ్యాచ్ ముగిసిన వెంటనే అతను ఐపీఎల్ కోసం ఇండియాకు బయలుదేరాడు. ఆదివారం (మే 18) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. స్టార్క్ లేకపోవడంతో అతని స్థానంలో ఢిల్లీ జట్టుకు విదేశీ పేసర్ గా బౌలింగ్ లో పర్వాలేదనిపించాడు. 3 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చి రాణించాడు. బంగ్లాదేశ్ కు అంతర్జాతీయ మ్యాచ్ లు ఉండడంతో మే 18-24 వరకు మాత్రమే ఈ బంగ్లా పేసర్ ఢిల్లీ క్యాపిటల్స్ ను అందుబాటులో ఉంటాడని సమాచారం. బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్  106 టీ20ల్లో 132 వికెట్లు పడగొట్టాడు. 

ఐపీఎల్ 2025రీ స్టార్ట్ కు ముందు ఆస్ట్రేలియా ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ దూరమయ్యాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 6 కోట్లకు ముస్తాఫిజుర్ ఢిల్లీ జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.2 కోట్లతో ఆక్షన్ లోకి వచ్చినా ముస్తాఫిజుర్ అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్  106 టీ20ల్లో 132 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 11 మ్యాచ్ ల్లో 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.