ఏరియా ఆస్పత్రిలో కార్పొరేట్ తరహా సేవలు : రామారావు పటేల్​

ఏరియా ఆస్పత్రిలో కార్పొరేట్ తరహా సేవలు :  రామారావు పటేల్​

భైంసా, వెలుగు: ప్రజల ఆరోగ్యం, సంరక్షణే తన అంతిమ లక్ష్యమని ముథోల్​ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. నిర్మల్​ జిల్లా భైంసాలోని గవర్నమెంట్​హాస్పిటల్​లో గురువారం ఆయన మీటింగ్​ నిర్వహించారు. హాస్పిటల్​లో సీటి స్కానింగ్, అల్ట్రాసౌండ్​ స్కానింగ్​ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఏరియా హాస్పిటల్​లో కార్పొరేట్​తరహా వైద్య సేవలు అందించాలన్నది తన లక్ష్యమన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్​ జాబీర్ అహ్మద్, సూపరింటెండెంట్ కాశీనాథ్ తదితరులు ఉన్నారు.