భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్వహించే హోమ్ మ్యాచ్‌లు అన్నింటికీ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ 'ముత్తూట్ ఫిన్‌కార్ప్' దక్కించుకుంది. వచ్చే రెండు సీజన్ల పాటు ఈ ప్రతిష్టాత్మక ఒప్పందం అమల్లో ఉండనుంది. భారతీయ క్రికెట్ వాతావరణంలో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
బ్లూ ముత్తూట్ పేరుతో కొత్త స్పాన్సర్‌షిప్:
ఈ కొత్త టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను బ్లూ ముత్తూట్ అని వ్యవహరించనున్నట్లు వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్‌కు రూ. 4.85 కోట్ల కనీస ధర (బేస్ ప్రైస్) ప్రాతిపదికన ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. కానీ, తుది ధర దీనికంటే తక్కువగా ఉండే ఛాన్స్ కూడా ఉంది, బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసిన తర్వాతే పూర్తి క్లారిటీ రానుందని తెలుస్తోంది.
బిడ్డర్ల కొరత, బీసీసీఐ ప్రత్యామ్నాయ చర్చలు:
కొత్త టైటిల్ స్పాన్సర్ ప్రకటన ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆశించిన స్థాయిలో తీవ్రమైన బిడ్డర్లు ముందుకు రాకపోవడమే. ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం, నిర్ణయించిన కనీస ధర చాలా ఎక్కువగా ఉండటమే దీనికి పాక్షికంగా కారణమైంది. గతంలో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మ్యాచ్‌కు రూ. 4.2 కోట్లు చెల్లించింది. బీసీసీఐ నిర్దేశించిన టెండర్ (ITT) గడువు ఆగస్టు 13వ తేదీ నాటికి ఎలాంటి పోటీ బిడ్డర్లు ఇంకా ఫిక్స్ కాలేదు. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి పలు ప్రముఖ సంస్థలతో నేరుగా చర్చలు జరిపింది. ఈ క్రమంలో గూగుల్ జెమిని, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, స్పిన్నీ, ఎస్‌బీఐ లైఫ్ లాంటి సంస్థలను సంప్రదించినట్లు సమాచారం.
అసోసియేట్ పార్ట్‌నర్‌లుగా ఎస్‌బీఐ లైఫ్, క్యాంపా, చాట్‌జీపీటీ:
టైటిల్ స్పాన్సర్‌షిప్‌తో పాటు ఇతర ప్రముఖ కంపెనీలు కూడా భారత క్రికెట్ బోర్డుతో జతకట్టాయి. ఎస్‌బీఐ లైఫ్ సంస్థ, క్యాంపా, చాట్‌జీపీటీలతో కలిసి బీసీసీఐకి అసోసియేట్ పార్ట్‌నర్‌లుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ మూడు కంపెనీలు రెండు సీజన్ల కాలానికి ఒప్పందం చేసుకున్నాయి. వెస్టిండీస్‌తో భారత్‌లో జరిగే హోమ్ సిరీస్ నుంచి ప్రారంభమై మార్చి 2028 వరకు ఈ ఒప్పందాలు చేసుకున్నాయి.
2028 వరకు హోమ్ మ్యాచ్‌ల హక్కులు:
కొచ్చి కేంద్రంగా పని చేస్తున్న ముత్తూట్ కుటుంబానికి చెందిన ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థ, మార్చి 31, 2028 వరకు భారతదేశంలో జరిగే అన్ని అంతర్జాతీయ, దేశీయ మ్యాచ్‌ల టైటిల్ హక్కులను సంపాదించింది. ఈ మొత్తం కాలంలో సుమారు 35 హోమ్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ప్రత్యేకంగా 10 టెస్టులు, 12 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఉండటం విశేషం.
వెస్టిండీస్ సిరీస్‌తోనే ఆరంభం:
ఈ కొత్త భాగస్వామ్యం తక్షణమే అమల్లోకి రానుంది. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభంకానున్న వన్డే సిరీస్ నుంచి ఈ స్పాన్సర్‌షిప్ అధికారికంగా స్టార్ట్ కానుంది. విశేషం ఏమిటంటే, ఈ సిరీస్ ముత్తూట్ సంస్థ సొంత రాష్ట్రమైన కేరళలో ప్రారంభంకానుంది. తిరువనంతపురంలో జరగనున్న తొలి వన్డేతో ఈ కొత్త ఒప్పందం లాంఛనంగా మొదలుకానుంది.
🔴BREAKING: INDIAN CRICKET GETS A NEW TITLE SPONSOR🤯
— Sam (@cricsam02) September 24, 2026
- Muthoot Finance Limited, also known as Muthoot Fincorp, has bagged the title rights for Indian cricket.
- The deal is reportedly for the next 2 years.
- Muthoot becomes the latest major brand to associate with Indian… pic.twitter.com/0qzhgnU4gj
