
- పారా క్రీడాకారులుగా తీర్చిదిద్దుతం: ముత్తినేని వీరయ్య
హైదరాబాద్, వెలుగు: దివ్యాంగ నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడమే తమ లక్ష్యమని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. వారి కోసం ఏడాది పొడువున్నా ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా కాంపిటీటీవ్ కోర్సుల్లో కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. శనివారం మలక్ పేటలోని కార్పొరేషన్ కార్యాలయంలో వికలాంగుల సహాకార సంస్థ బోర్డు మీటింగ్ చైర్మన్ వీరయ్య అధ్యక్షతన జరిగింది. మీటింగ్‌లో పలు తీర్మానాలు చేసిన అనంతరం వీరయ్య మాట్లాడారు.
పారా స్పోర్ట్స్ లో ప్రతిభ గలవికలాంగులను గుర్తించి ప్రోత్సహించడానికి జిల్లాల వారీగా క్రీడా వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. పారా స్పోర్ట్స్ పెడరేషన్ లకు క్రీడా సామగ్రిని అందచేస్తామని చెప్పారు. దీనికి రూ. 50 లక్షలు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. దృష్టి లోపం ఉన్న నిరుద్యోగ వికలాంగుల కోసం అప్జల్ గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో డిజిటల్ యాక్సెస్ లైబ్రరీనీ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి రూ.10 లక్షలు కేటాయించనున్నట్లు వీరయ్య పేర్కొన్నారు.