సిటీల్లో చాలామందికి ఇంటిదగ్గర టూ వీలర్ పార్కింగ్‌కు ప్లేస్ దొరకదు. దాంతో బైక్స్‌ను ఇంటి బయట, గేటు ముందు పార్క్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తారనే భయం కూడా ఉంటుంది. అలాగని సీసీ కెమెరాలు పెట్టించాలి అనుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడు డమ్మీ కెమెరాలు పెట్టుకుంటే దొంగలు కాస్తయినా భయపడతారు.
వీటిని ఎంఎక్స్ అనే కంపెనీ మార్కెట్లో అమ్ముతోంది. ఈ కెమెరాలను ఎక్కడైనా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రెండు ఏఏఏ బ్యాటరీలు వేస్తే.. నిజమైన కెమెరాలాగే ఇందులో కూడా చిన్న రెడ్ లైట్ బ్లింక్ అవుతుంటుంది. కానీ.. ఇందులో లెన్స్‌లు ఉండవు. ఇది ఆడియో, వీడియో రికార్డ్ చేయలేదు.
ధర: 199 రూపాయలు
4 ఇన్ 1 లైట్
క్యాంపింగ్ లేదా టూర్‌కి వెళ్లినప్పుడు ఫ్లాష్‌లైట్, పవర్‌బ్యాంక్, టేబుల్ ల్యాంప్ లాంటివాటిని తీసుకెళ్తుంటారు. కానీ.. ఈ ఒక్క గాడ్జెట్ ఉంటే వాటన్నిటి అవసరమే ఉండదు. ఎందుకంటే.. ఇదొక్కటే అన్నింటి అవసరాలు తీరుస్తుంది. విప్రో కంపెనీ తీసుకొచ్చిన ఈ మల్టీ ఫంక్షనల్ లైట్‌కి నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి హై క్వాలిటీ ఎల్ఈడీ లైట్ ఉంటుంది. టార్చ్‌లా పనిచేస్తుంది.
అదే లైట్‌ని గాడ్జెట్ పై భాగాన్ని సాగదీసి టేబుల్ ల్యాంప్‌లా కూడా వాడుకోవచ్చు. మూడు డిమ్మింగ్ అడ్జట్స్మెంట్స్ ఉంటాయి. పవర్ బ్యాంక్‌లా కూడా పనిచేస్తుంది. ఇందులో 3000 mAH లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్, హెడ్‌ఫోన్ లాంటివాటిని ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్బీ అవుట్‌పుట్ ఉంటుంది. ఫోన్ హోల్డర్లా కూడా ఉపయోగపడుతుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది. 24 గంటల వరకు బ్యాకప్ ఇస్తుంది.
ధర : 1,499 రూపాయలు
బ్యాటరీ టెస్టర్
ఇంట్లో టీవీకి వాడే రిమోట్ దగ్గర్నించి కంప్యూటర్ మౌస్, టాయ్స్ వరకు అన్నింటిలో బ్యాటరీలను వాడుతుంటాం. అయితే.. వాటిలో బ్యాటరీ లైఫ్ ఇండికేషన్ ఉండదు. అలాంటప్పుడు బ్యాటరీ ఇంకెన్ని రోజులు పనిచేస్తుందో అంచనా వేయడం కష్టమే. కాబట్టి బ్యాటరీలను ఈ టెస్టర్లో పెట్టి చెక్ చేసుకోవాలి. ఇందులో ఏఏ, ఏఏఏ, సీ, డీ, 1.5V,9V, బటన్ బ్యాటరీలను పెట్టి చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఇండికేటర్ ముల్లు రెడ్ కలర్ మీదకి వచ్చిందంటే... బ్యాటరీ మార్చాలనే సజెషన్. ఆకుపచ్చ రంగు మీద ముల్లు ఉంటే బ్యాటరీ బాగుందని, ఎల్లో కలర్ మీద ఉంటే లో బ్యాటరీ అని అర్థం.
ధర : 275 రూపాయలు
గేమింగ్ ట్రిగ్గర్స్
ఫోన్లో ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్లకు పనికొచ్చే ట్రిగ్గర్స్ ఇవి. గేమ్ ఆడుతున్నప్పుడు కింది భాగంలో స్క్రీన్‌ని బొటనవేలితో టచ్ చేస్తుంటారు. కానీ.. పైభాగంలో ఉండే ట్రిగ్గర్స్‌ని చూపుడు వేలితో క్లిక్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. ఆ ప్లేస్‌లో ఈ ట్రిగ్గర్స్‌ని ఇన్స్టాల్ చేసుకుని, వీటి పైభాగంలో ఉండే బటన్స్‌ని నొక్కచ్చు. స్పిన్ బోట్ అనే కంపెనీ వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఇవి స్ట్రాంగ్ ఏబీఎస్ మెటీరియల్‌తో తయారయ్యాయి. మిలియన్ ప్రెస్ టెస్ట్‌లో కూడా పాస్ అయ్యాయి. అంటే వీటిని పది లక్షల సార్లు నొక్కినా పనిచేస్తాయన్నమాట. బటన్లకు ప్రీమియం నికెల్ కోటింగ్ ఉంటుంది. వీటిని ఇన్స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ రెండింటికీ వాడుకోవచ్చు. పబ్జీ, రూల్స్ ఆఫ్ సర్వైవల్, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ లాంటి గేమ్స్‌కి ఇది బాగా సరిపోతుంది.
ధర: 449 రూపాయలు