అరుళ్ నిధి, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మై డియర్ సిస్టర్’. ప్రభు జయరామ్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, గోల్డ్ మైన్స్ బ్యానర్లపై సుధన్ సుందరం, మనీష్ షా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అరుళ్ నిధి, మమతా మోహన్ దాస్ చెరో ఊయలపై ఊగుతూ కనిపిస్తున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది.
అన్నా చెల్లెలి అనుబంధం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు, ఇందులోని ఎమోషన్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని దర్శకుడు ప్రభు జయరామ్ చెప్పాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని నిర్మాతలు తెలియజేశారు. అరుణ్ పాండియన్, మీనాక్షి గోవిందరాజన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు.
