మోడీ ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ.. భారత్ బచావో పేరుతో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. తాను రాహుల్ సావర్కర్ ను కాదని.. రాహుల్ గాంధీని.. అని సమాధానమిచ్చారు. ఈ సభలో శుక్రవారం పార్లమెంట్ లో జరిగిన వివాదంపై కూడా స్పందించారు రాహుల్ గాంధీ.నిజం మాట్లాడితే క్షమాపణ చెప్పాలా అంటూ మోడీ గవర్నమెంట్ ను ప్రశ్నించారు. రేప్ ఇండియా వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, ప్రధాని మోడీ, అమిత్‌షాలే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో ప్రజలు కోలుకోలేనంత పెద్ద దెబ్బ కొట్టారని ఆయన అన్నారు. పేదల జేబుల్లోని డబ్బులు లాక్కుని పెద్దవాళ్లకు మోడీ పంచిపెట్టారని రాహుల్ అన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదు కానీ, పెద్దవారికి వేలకోట్ల రూపాయిల బకాయిలు మాఫీ చేశారని ఆయన అన్నారు. మోడీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నదని ఆయన అన్నారు.

