ఒక‌టి త‌ర్వాత ఒక‌టి.. వ‌ర‌స‌గా మూడు భూకంపాలు

ఒక‌టి త‌ర్వాత ఒక‌టి.. వ‌ర‌స‌గా మూడు భూకంపాలు

మయన్మార్ వరుస భూకంపాలతో దద్దరిల్లింది. జూన్ 21 బుధవారం అర్థరాత్రి నుంచి ఆ దేశంలో వరుసగా మూడు భూకంపాలు నమోదయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు యాంగాన్ లో 4.5 తీవ్రతతో భూమి కంపించింది.  యాంగాన్ కు 174 కిలోమీటర్ల దూరంలో భూమికి 48కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర కేంద్రీకృతమైందని  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది..

ఆ తర్వాత జూన్ 22వ తేదీ గురువారం తెల్లవారుజామున 2:52  గంటలకు 4.2 తీవ్రతతో మరోసారి  భూకంపం వచ్చింది. ఈ భూకంపం కేంద్రం భూమి నుంచి 10 కిలోమీటర్ల లోతులో, యాంగూన్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

అంతకుముందు జూన్ 21వ తేదీ  బుధవారం అర్ధరాత్రి 11.57 గంటలకు తొలి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతగా నమోదైంది. మయన్మార్ లోని యాంగాన్ లో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కేంద్రం భూమి నుంచి 25 కిలోమీటర్ల లోతులో, యాంగూన్ కు 227  కిలోమీటర్ల దూరంలో ఉంది.  

భయంతో పరుగులు..

వరుస భూకంపాలతో మయన్మార్ ప్రజలు వణికిపోతున్నారు. యాంగాన్ భూకంపాలతో దద్దరిల్లిపోవడంతో అక్కడి ప్రజలు పరుగులు తీశారు. వరుసగా  మూడు భూకంపాలు కూడా రిక్టర్ స్కేలుపై 4 కన్నా ఎక్కువ తీవ్రతతో సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ భూకంపాల వల్ల  ఇప్పటి వరకు ఎంత ప్రాణ నష్టం జరిగింది అనే వివరాలు ప్రకటించలేదు అధికారులు