ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు

ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు

నేపిడా: ఆంగ్ సాన్ సూకీపై జరుగుతున్న కేసు విచారణలో మయన్మార్ కోర్టు తీర్పును ప్రకటించింది. అవినీతితో సహా పలు ఇతర అభియోగాలను ఎదుర్కొంటున్న సూకీకి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్మీకి వ్యతిరేకంగా అసమ్మమతిని ప్రేరేపించినందుకు, కొవిడ్ రూల్స్ ను ఉల్లంఘించినందుకు సూకీని కోర్టు దోషిగా తేల్చింది. నేచురల్ డిజాస్టర్ లాతోపాటు సెక్షన్ 505 (బీ) కింద ఆమెకు జైలు శిక్ష వేసింది. ఈ విషయాన్ని జుంటా ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. సూకీతోపాటు ఆ దేశ మాజీ ప్రెసిడెంట్ విన్ మైంట్ కు కూడా కోర్టు శిక్ష విధించింది. సూకీకి వేసిన సెక్షన్లనే విన్ మైంట్ కు కూడా వేసిన కోర్టు.. నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఇకపోతే,  రెండోసారి పదవిని చేపట్టకుండా సూకీని అరెస్టు చేసి, ఆమె పార్టీని నిలువరిస్తూ ఫిబ్రవరి 1వ తేదీన సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకుంది.