ఆంగ్ సాన్ సూకీ అరెస్ట్.. ఆర్మీ గుప్పిట్లో మయన్మార్‌‌

ఆంగ్ సాన్ సూకీ అరెస్ట్.. ఆర్మీ గుప్పిట్లో మయన్మార్‌‌

యాంగాన్: మయన్మార్‌‌లో తిరిగి ఎమర్జెన్సీ విధించడం సంచలనంగా మారింది. ఆ దేశ స్టేట్ కౌన్సిలర్, తిరుగులేని నేత అయిన ఆంగ్ సాన్ సూకీని అక్కడి మిలటరీ నిర్బంధించింది. గత 50 ఏళ్లుగా సైన్యం చేతిలోనే మగ్గి తేరుకున్న మయన్మార్‌‌లో తిరిగి సైనిక తిరుగుబాటుతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కొన్ని వారాలుగా ఆ దేశ ప్రభుత్వానికి అక్కడి ఆర్మీకి మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం సూకీతోపాటు ఆమె పార్టీలోని కొందరు సీనియర్ నేతలను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. దేశం తమ పాలనలోకి వచ్చేసిందని, ఏడాది పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నామని ఆర్మీ ప్రకటించింది.