Fact Check : టైటానిక్ షిప్ దగ్గర.. అస్థిపంజరం లాంటి ఆనవాళ్లు ఏంటీ!?

Fact Check : టైటానిక్ షిప్ దగ్గర..  అస్థిపంజరం లాంటి ఆనవాళ్లు ఏంటీ!?

టైటానిక్.. టైటానిక్.. టైటానిక్.. సబ్ మెరైన్ అదృశ్యం.. పేలిపోయిన తర్వాత ఎన్నో.. మరెన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. టైటానిక్ షిప్ దగ్గర ఏదో శక్తి ఉందని.. అక్కడ ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా దొరకటం కష్టం అంటూ టైటానిక్ సినిమా దర్శకుడు జేమ్స్ కామెరూన్​ చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఇప్పుడు సబ్​మెరైన్​శిథిలాలు అంటూ కొత్త ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై భిన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి.. టైటానిక్ శిథిలాల దగ్గర.. సముద్ర గర్భంలో.. అస్థిపంజరం ఆకారంలో ఉన్న ఫొటో సంచలనంగా మారింది. దీన్ని చూస్తుంటే.. ఇది కచ్చితంగా సబ్​మెరైన్​ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిది అయ్యి ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.అమెరికా వాళ్లకు 13 అనే నంబర్​సెంటిమెంట్ పరంగా అస్సలు నచ్చదు.

ఇప్పుడు టైటానిక్ సబ్ మెరైన్ షిప్ గల్లంతు వెనక కూడా ఈ 13 నెంబర్.. ట్రిబుల్ 111 నంబర్​సెంటిమెంట్​ఉందనే ప్రచారం జరుగుతోంది. టైటానిక్ షిప్ యాక్టిడెంట్ అయ్యింది 1912.. ఇది కూడితే వచ్చేది 13.. మంచు పర్వతాన్ని ఢీకొట్టింది ఏప్రిల్ 13.. మునిగిపోయింది ఏప్రిల్ 14వ తేదీ అంటున్నారు. కచ్చితంగా 111 సంవత్సరాల తర్వాత.. అందులో 3 అంకెలున్నాయి. ఇప్పుడు మళ్లీ టైటానిక్ సబ్ మెరైన్.. అదే టైటానిక్ షిప్ దగ్గర పేలిపోవటం, ఐదుగురు చనిపోవటం చూస్తుంటే.. ఏదో సెంటిమెంట్.. అదృశ్య శక్తి వెంటాడుతోందనే ప్రచారం జరుగుతోంది.

Fact Check : టైటానిక్ సబ్ మెరైన్ ఫొటోల వెనక నిజం ఏంటీ..

టైటాన్​ సబ్​మెరైన్​ శిథిలాలంటూ కొన్ని ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి జలాంతర్గమి నిర్మాణాన్ని పోలి ఉండటం ఫొటోలు దానివేననే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. అయితే పేలుడుకు సంబంధించిన ఈ చిత్రాలు ఫేక్ అని యూఎస్​ కోస్ట్​ గార్డ్​ అధికారులు స్పష్టం చేశారు. ఆ వైరల్​ ఫొటోలు ఫేక్​ అని.. దానికి సంబంధించిన ఫొటోలేవీ విడుదల చేయలేదని ధ్రువీకరించారు. అవి టైటానిక్​ శిథిలాలకు సంబంధించినవని తెలిపారు.