ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో జరిగిన మరణాలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక ఇంట్లో ముగ్గురు మనుషులు ఉరి వేసుకుని చనిపోవటం అనేది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఉరి వేసుకున్న ముగ్గురి చేతులు కట్టేసి ఉన్నాయి.. కాళ్లు కూడా కట్టేసి ఉన్నాయి.. కాళ్లు చేతులు కట్టేసుకుని ఉరి ఎలా వేసుకుంటారనే కామన్ డౌట్ అందరికీ వస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఎం.మధుసూదన్ రావు అనే 65 ఏళ్ల వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. అతను రిటైర్డ్ ప్రభుత్వ టీచర్. అతని భార్య రత్నావళి వయస్సు 60 ఏళ్లు. ఇక కుమారుడు సాయి సుకృత్ వయస్సు 25 ఏళ్లు. ఈ ముగ్గురు వారి ఇంట్లోనే ఉరి వేసుకుని కనిపించారు.
ఉరి వేసుకున్న ఈ ముగ్గురి చేతులు కట్టేసి ఉన్నాయి. రిటైర్డ్ ప్రభుత్వ టీచర్ మధుసూన్ రావు చేతులకు టవల్ తో కట్టేసి ఉన్నాయి. ఇక కుమారుడు సాయి సుకృత్ కాళ్లు కట్టేసి ఉన్నాయి. చేతులు వెనక్కి కట్టేసి ఉన్న స్థితిలో వేలాడుతూ కనిపించాడు. ఇక భార్య రత్నావళి చేతులు కట్టేసి ఉన్నాయి.
ముగ్గురి చేతులు కట్టేసి ఉండటంతో ఈ మరణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చేతులు కట్టేసుకుని ఉరి ఎలా వేసుకుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంట్లోని ఓ గోడపై మరణ వాంగ్మూలం బీరువాలోని ఫొటో ఆల్బమ్ లో ఉంది అని గోడపై ఉన్న కాగితంపై రాసి ఉంది. ఈ కాగితం గోడకు అంటించారు.
ఉరికి వేలాడుతున్న తీరు.. చేతులు, కాళ్లు కట్టేసి ఉండటం చూస్తుంటే ఈ మరణాల వెనక కుట్ర కోణం ఉందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తూ.. ఆ దిశగా విచారణ చేస్తున్నారు పోలీసులు. ఓ రిటైర్డ్ ప్రభుత్వ టీచర్ ఇంత దారుణానికి ఎలా పాల్పడ్డాడు అనేది గ్రామస్తులను సైతం విస్మయానికి గురి చేస్తుంది.
ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు, అతని భార్య, కుమారుడు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో ఉరి వేసుకుని కనిపించడంతో, వారి మరణాల తీరుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని, పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రిటైర్డ్ టీచర్ అయిన మధుసూదన్ రావు అందరితో బాగుంటారని.. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావటం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఈ మరణాలపై కుట్ర కోణంలోనూ విచారణ చేస్తున్నారు పోలీసులు.
