RT4GM మాస్ కాంబో.. ఈసారి బాక్సాఫీస్ జాతరే

RT4GM మాస్ కాంబో.. ఈసారి బాక్సాఫీస్ జాతరే

మాస్ మహారాజ రవితేజ(Raviteja) మరో సినిమాను లైన్లో పెట్టేశారు. అది కూడా తనకు వరుసగా మూడు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand malineni) కాంబోలో. ఇప్పుడు నాలుగోసారి ఈ కాంబో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి వస్తున్నారు. ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mttri movie makers) తెరకెక్కిస్తున్నారు.

దీనికి సంబందించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ.. "RT4GM.. ది మాసియెస్ట్ కాంబో బ్యాక్ అగైన్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్ చూస్తుంటే.. రవితేజ గత సినిమాల్లాగే ఈ సినిమా కూడా పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుందని అర్థమవుతోంది. దీంతో రవితేజ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్(Thaman) సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 

ఇక ప్రస్తుతం రవితేజ టైగెర్ నాగేశ్వర రావు(Tiger Nageshwara rao) సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత రవితేజ ఈగర్(Eagle) పేరుతో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని(Karthi gattamaneni) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక RT4GM సెట్స్ పైకి వెళ్లనుంది.