చంద్రబాబు నాయుడికి కరోనా పాజిటివ్

చంద్రబాబు నాయుడికి కరోనా పాజిటివ్

TDP అధినేత చంద్రబాబు నాయుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. కరోనా నిర్ధరణ కావడంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ట్వీట్  చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉండవల్లిలోని  తన నివాసంలో చంద్రబాబు హోంఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల కాలంలో తనకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  మరోవైపు చంద్రబాబు కుమారుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు నిన్న కొవిడ్  నిర్ధరణ అయ్యింది. 

 

 

కాగా.. చంద్రబాబుకు కరోనా సోకడంతో.. ఆయన త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.