ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాధ్యాయం..సీఎంగా, ప్రధానిగా మోదీ పాతికేండ్ల పాలన అపూర్వం : ఎన్‌‌‌‌‌‌‌‌. రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు

 ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాధ్యాయం..సీఎంగా, ప్రధానిగా మోదీ పాతికేండ్ల పాలన అపూర్వం : ఎన్‌‌‌‌‌‌‌‌. రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు
  •     బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్‌‌‌‌‌‌‌‌. రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏండ్ల ప్రజాసేవ పూర్తి చేసుకోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌‌‌‌‌‌‌. రాంచందర్‌‌‌‌‌‌‌‌ రావు అన్నారు. తన జీవితాన్ని సంపూర్ణంగా దేశసేవకే అంకితం చేసిన అసలైన ప్రజా నాయకుడు అని కొనియాడారు. మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని బుధవారం ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభ, సేవా జ్యోతి యాత్రలో రాంచందర్​ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 

2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్థానం ప్రారంభించిన మోదీ.. ఆ తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా నేటికి 25 ఏండ్లు పూర్తి చేసుకున్నారని గుర్తుచేశారు. 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్నదే మోదీ మహత్తర లక్ష్యమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వికసిత్ భారత్ సాధన కోసం దేశ ప్రజలతో ప్రధాని ‘మేం చేసి తీరుతాం’ అనే ఉమ్మడి ప్రతిజ్ఞ చేయించారని తెలిపారు.