హైదరాబాద్, వెలుగు: ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ డెవెలప్మెంట్ సంస్థ డీఈ షా ఇండియా.. హైదరాబాద్‌లోని నియోపొలిస్‌లోని గ్రావా బిజినెస్ పార్క్‌లో కొత్త ఆఫీసును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2027 నాటికి ప్రారంభం కానున్న ఈ కొత్త కార్యాలయం ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.
భారతదేశంలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ జూబ్లీహిల్స్ ఆఫీసులో నిర్వహించిన వేడుకకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
1996లో హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ సంస్థ 2023లో బెంగళూరు, గురుగ్రామ్‌లకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న డీఈ షాకు 115 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఉంది.
