మిన్హాజ్ రూమి, యష్నా ముత్తులూరి జంటగా అఖిల్ రాజ్ దర్శకత్వంలో లోడీ ఫాహద్ అలీఖాన్ నిర్మిస్తున్న చిత్రం ‘దేవ్ పారు’. ఈ చిత్రం నుంచి ‘నా ప్రాణమంత’ అనే పాటను శనివారం విడుదల చేశారు. కాలభైరవ పాడిన ఈ పాటను డైరెక్టర్ కృష్ణ చైతన్య విడుదల చేసి టీమ్‌కు విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దర్శకుడు అంజి ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుందని చెప్పాడు.
హీరో మిన్హాజ్ రూమి మాట్లాడుతూ ‘జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వరకు నా సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదురైనా ప్యాషన్‌తో ఈ సినిమా చేశా. రిలీజ్ తర్వాత నాకు మంచి పేరొస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు.
ఇందులో టీనేజర్, మెచ్యూర్డ్ అమ్మాయిగా రెండు షేడ్స్‌లో నటించానని హీరోయిన్ యష్నా చెప్పింది. ఇదొక ఎమోషనల్ ట్రాక్ అని దర్శకుడు అఖిల్ రాజ్ చెప్పాడు. సినిమాలోని లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని కలగలిపి యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమని నిర్మాత అలీఖాన్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
